రాష్ట్రవ్యాప్తంగా రూ. 1380 కోట్లతో ఏర్పాటు
హైదరాబాద్ : (TG) ప్రతీ ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆకాంక్షించారు. రాష్ట్రంలోని బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలో ఓ విప్లవాత్మక కార్యక్రమమన్నారు. ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును గృహ వినియోగదారులు, వ్యవసాయదారులు వాడుకున్నంత వాడుకొని మిగిలింది విద్యుత్ శాఖకు అమ్ముకునేలా ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తుందన్నారు.
మొత్తంగా రాష్ట్రంలోని కొడంగల్, బోనకల్ మండలాల్లో పూర్తిగాను, మిగిలిన జిల్లాల్లోని 81 గ్రామాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. ఇళ్లపై కప్పుల పైన మాత్రమే కాకుండా వ్యవసాయ పంపుసెట్ల పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందు కోసం రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం మొత్తం మీద సోలార్ విద్యుత్ ద్వారా ఒక కుటుంబ రూ. 14 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
Read Also: Adilabad: కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
ప్రభుత్వ బడులు, ఆఫీసులపై కూడా సౌరవిద్యుత్ ప్లాంట్లు
ఉత్పత్తయిన విద్యుత్తును అవసరాల కోసం వాడుకోగా ఏడాదికి కనీసం 1,086 యూనిట్ లను యూనిట్ కు 2.57 రూపాయల చొప్పున విద్యుత్ సంస్థలకు విక్రయిస్తే ఒక కుటుంబానికి కనీసంగా దాదాపు రూ.5 వేల వరకూ మిగులుతుందన్నారు. మహిళలు ఇళ్లల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను పొదుపుగా వాడుకొని మిగిలింది విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని చెలిపారు. ఇప్పటివరకు విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించామని, ఇకనుంచి విద్యుత్ సంస్థలే ప్రజలకు డబ్బులు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు. రైతులు వ్యవసాయ పంప్ సెట్ల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని, అందుకు ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఏర్పాటు చేస్తుందన్నారు.
సోలార్ విద్యుత్ ఏడాది మొత్తం ఉత్పత్తి అవుతుందని, వ్యవసాయ పనులు ఏడు నెలలు మాత్రమే ఉంటాయని మిగిలిన సమయాల్లో విద్యుత్ను విక్రయించి రైతులు ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు పంటల ఉత్పత్తితో పాటు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా డబ్బులు సంపాదించాలనేదే ప్రభుత్వం ఆలోచనగా తెలిపారు. (TG) అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులు వరి పంట కోత అయ్యాక మిగిలిన వ్యర్ధాలకు నిప్పు పెడుతున్నారు ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: