📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

TG: రైతులకు అలర్ట్.. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై డెడ్‌లైన్

Author Icon By Rajitha
Updated: January 8, 2026 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సంక్రాంతి (sankranti) పండగ వరకు మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యానికి చేరువగా ధాన్యం సేకరణ పూర్తవడంతో, పండగ అనంతరం కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రైతులు ఆలస్యం చేయకుండా తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Deadline for monsoon season paddy procurement

రైతులు సంక్రాంతి లోపు తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 69 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తైంది. ఇది దాదాపు 95 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న నిల్వలు, ఇంకా రానున్న ధాన్యం కలిపి మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గత పదేళ్లలో ఇదే అత్యధిక ధాన్యం సేకరణగా నిలవనుంది.

ఇప్పటివరకు 13.70 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.16,942 కోట్లను జమ చేశారు. ఇందులో దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం రెండూ ఉన్నాయి. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ కూడా చెల్లిస్తుండగా, మిగిలిన బోనస్ మొత్తాన్ని కొనుగోళ్లు పూర్తయ్యేలోపు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల రైతులు సంక్రాంతి లోపు తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం ఎంతో కీలకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kharif Season latest news paddy procurement Telangana Farmers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.