TG Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైనథ్ మండలం తరోడ గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం(accident)లో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ
జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసుల రోడ్డు ప్రమాదం
పోలీసుల సమాచారం ప్రకారం, మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసులు. వీరు ఉపాధి కోసం మహారాష్ట్రలో మేస్త్రీ పనులు చేశారు మరియు పని ముగిసిన తర్వాత స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్, మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: