📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
A suggestion to be careful regarding children.. Sajjanar

(TG) హైదరాబాద్ సీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించటంతో పాటు రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రత పట్ల ప్రజలు ఎల్పప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా హెచ్చరిస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా సజ్జనార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో నిజంగా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. రోడ్డు ప్రమాదం నుంచి ఓ మూడేళ్ల వయస్సున్న చిన్నారి రెప్పపాటు కాలంలో తప్పించుకుందింది.

Read Also: Medaram Road Accident: భక్తుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

అప్రమత్తతే అసలైన రక్షణ’ అని ట్వీట్

(TG) ఓ రోడ్డు పక్కనే ఆటో నిలిపి ఉంది. దాని పక్కనే ఉన్న చిన్నారి రోడ్డుకు అవతలి వైపు ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆగి ఉన్న ఆటో ముందు నుంచి సడెన్‌గా రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ వెనకలే చాలా వేగంగా ఓ బస్సు దూసుకొచ్చింది. ఆటో ముందు చిన్నారి ఉందన్న విషయం బస్సు డ్రైవర్‌కు కనిపించలేదు. ఎందుకంటే అది బ్లైండ్ స్పాట్. దీంతో చిన్నారి బస్సు సమీపంలో వరకు వేగంగా వచ్చేసింది. బస్సుకు, చిన్నారికి మధ్య దూరం కేవలం రెండు, మూడు ఇంచులు మాత్రమే. ఇంతలో డ్రైవర్ అప్రమత్తమై సడెన్ బ్రేక్ వేశాడు. లేదంటే చిన్నారి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయేది. ఆ ఘటన ఊహించుకుంటునే భయంగా ఉంది.

అందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. చిన్న పిల్లలను ఎప్పుడూ రోడ్డుపై అలా నిర్లక్ష్యంగా వదిలేయెుద్దని తల్లిదండ్రును విజ్ఞప్తి చేశారు. ‘ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో ఉండబట్టి పెను ప్రమాదం తప్పింది. కానీ గుర్తుంచుకోండి.. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం ఉండదు. తల్లిదండ్రులారా..! రహదారుల పక్కన నడుస్తున్నప్పుడు మీ పిల్లల చేతిని వదలకండి. చిన్న నిర్లక్ష్యం తీరని శోకాన్ని మిగులుస్తుంది. జాగ్రత్తగా ఉండండి! అప్రమత్తతే అసలైన రక్షణ’ అని ట్వీట్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Accident Prevention child safety CP VC Sajjanar Latest News in Telugu Public Awareness Campaign road safety Social Media Awareness Telugu News twitter Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.