తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డు (TSHB) తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకునేందుకు, ఖాళీగా ఉన్న కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రయత్నంలో ప్రధానంగా హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని కీలక భూములను వేలం ద్వారా ఆఫర్ చేయనున్నారు. ఇలా సమకూరే నిధులు కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ గృహ నిర్మాణాలకు వినియోగపడతాయి అని బోర్డు అధికారులు చెప్పారు.
Read also: BRS : ఖమ్మం BRSలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం
15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో
హైదరాబాద్‌లో చందానగర్ పరిధిలో మూడు వేర్వేరు స్థలాల్లో మొత్తం 7,118 గజాల కమర్షియల్ ప్లాట్లు వేలం చేయబడ్డాయి. వీటి విస్తీర్ణం 2,593, 1,809, 2,716 గజాలుగా ఉంటుందని, ఒక్క గజానికి కనీస ధర రూ.40,000గా నిర్ణయించారన్నారు. వేలం ఈ నెల 16న నిర్వహించనున్నారు. అలాగే కరీంనగర్ పట్టణంలో రెండు ప్రాంతాల్లో మొత్తం 7,360 గజాల భూమిని (4,335, 3,025 గజాలు) వేలం చేయబోతున్నారు. ఇక్కడి ప్లాట్లకు గజం కనీస ధర రూ.30,000గా ఖరారు చేశారు. ఈ వేలం ఈ నెల 17న జరుగనుంది.
TSHB ఈ వేలాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తుందని హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ (MD) వి.పి. గౌతమ్ తెలిపారు. ఆసక్తిగల పెట్టుబడిదారులు ఈ నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ముందస్తు ప్రీ-బిడ్ సమావేశం ఈ నెల 9వ తేదీ హైదరాబాద్, హిమాయత్‌నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: