(TG) హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా, నేటి నుంచి కొత్తగా 65 బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి.అయితే ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. వీటిల్లో కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. బుధవారం నుంచి ఈ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులను.. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి,
Read Also: Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్ స్టాళ్ల సందర్శన.. ఆ విద్యార్థులకే అనుమతి
2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యం
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డిలు రాణిగంజ్ డిపోలో ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరంలో రెండేళ్ల నాటికి.. మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. విడతల వారీగా బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: