Telugu News: TG: వరద బాధిత కుటుంబాలకు 12.99 కోట్ల సాయం

Read Time:  1 min
TG
TG
FONT SIZE
GET APP

హైదరాబాద్: మొంథా తుఫాను(Montha cyclone) ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ తెలంగాణ(TG) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో దెబ్బతిన్న 8,662 ఇళ్లకు రూ.15,000 చొప్పున సహాయం అందిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరికి తక్షణ సాయంగా ప్రభుత్వం మొత్తం రూ.12.99 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

Read Also: CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి

TG
TG

తుఫాను ప్రభావం, మృతుల సంఖ్య

అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కోతగూడెం, నల్గొండ భారీ వర్షాలు కురిశాయి. ఈ భీకర వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 16 మంది మృతిచెందగా, వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.

రహదారులకు భారీ నష్టం

మొంథా తుఫాను కారణంగా 14 జిల్లాల్లో రోడ్లు, భవనాల శాఖ భారీ నష్టాన్ని గుర్తించింది. మొత్తం 334 ప్రాంతాల్లోని 230.41 కిలోమీటర్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

  • నష్టం వివరాలు: 201 రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లగా, 8 రోడ్లకు పగుళ్లు వచ్చాయి. 61 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి.
  • పునరుద్ధరణ: 156 ప్రాంతాల్లో రాకపోకలు ఆగిపోగా, అధికారులు వాటిని వేగంగా పునరుద్ధరించారు.

జిల్లా కలెక్టర్లు పంపించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ తక్షణ సాయాన్ని మంజూరు చేసింది.

సీఎం ప్రకటించిన ఇతర పరిహారాలు

మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరంగల్ పర్యటనలో పరిహారాలను ప్రకటించారు:

  • పంట నష్టం: ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం.
  • ప్రాణ నష్టం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు.
  • పశు నష్టం: మరణించిన పశువుల యజమానులకు రూ.50,000 చొప్పున పరిహారం.
  • ఇతర సాయం: నీట మునిగిన ఇంటికి రూ.15 వేలు, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.