📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG) మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. మిర్యాలగూడలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం, ఈ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Telangana: పరిశ్రమలకు ఉన్నత విద్యారంగం అనుసంధానం

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ

(TG) కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ (phone tapping case) జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్  చేసి భార్య భర్తల మాటలు కూడా విన్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని రేవంత్ చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురేలేదు విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. 7 కార్పొరేషన్‌లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం కార్యకర్తలకు, నాయకులను కోరారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండేళ్లలోనే రైతుల సంక్షేమం కోసం రూ.లక్షా 10 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. గతంలో వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ అన్నారని గుర్తుచేస్తూ, ప్రస్తుతం వరి పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy farmer welfare Latest News in Telugu Miryalaguda Visit Municipal Elections rythu bharosa Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.