తెలంగాణ రాష్ట్రంలో నేడు (జూన్ 18) నుండి టెట్ (TET – Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్షా విధానం, టైమింగ్స్ వివరాలు
ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. పేపర్-1, పేపర్-2లకు సంబంధించి అభ్యర్థులు తమకు అనుగుణంగా సెలెక్ట్ చేసుకున్న సెషన్‌లో హాజరయ్యే అవకాశముంది. అభ్యర్థులు పరీక్షా సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
అభ్యర్థులకు సూచనలు
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు పత్రం (ID Card) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లేకపోతే పరీక్షా కేంద్రంలో అనుమతి లభించదు. అదనంగా, ఎలక్ట్రానిక్ పరికరాలు, నోట్స్ వంటివి తీసుకెళ్లడం నిషేధించబడింది. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు నిబంధనలు పాటించి సమయానికి హాజరై పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Read Also : Modi : జర్మనీ, కెనడా దేశాధినేతలతో ప్రధాని భేటీ