తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విషయంలో నిర్ణయాత్మక దశ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ పరీక్షలను మార్చి మూడో వారం నుంచి ప్రారంభించేలా విద్యాశాఖ ఆలోచిస్తోంది. మార్చి 16 లేదా 18 తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు ఈ అధికారిక షెడ్యూల్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై విద్యాశాఖ ముందుగానే చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
Breaking News – Harish Rao Father Died : హరీశ్ రావుకు ఇంట విషాద ఛాయలు
ఇక ఇంతకుముందే ఇంటర్మీడియట్ బోర్డు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సంవత్సరాలుగా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే విధానం అమల్లో ఉంది. అదే పద్ధతిని ఈసారి కూడా కొనసాగిస్తూ, పరీక్షల మధ్య కలిగే ఖాళీలు మరియు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో విద్యార్థులకు రివిజన్‌కి అవసరమైన సమయం లభించనుంది.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల రహస్యత, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల వినియోగం, మాల్ప్రాక్టీస్ నివారణ వంటి చర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులు కూడా ముందస్తుగా తమ చదువుని సక్రమంగా రూపొందించుకొని, షెడ్యూల్ అధికారికంగా ప్రకటించిన వెంటనే మరింత కేంద్రీకరణతో సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలోనే ఈ పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/