Kavitha: తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని ఒక ఆలయంలో చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, డీజీపీని కలిసేందుకు వెళ్లారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆమెను కార్యాలయం వెలుపలే అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
Read Also: Maoist Leaders Meeting: సీఎం రేవంత్ తో భేటీకానున్న మావోయిస్టు అగ్రనేతలు
న్యాయం కావాలంటూ తెలంగాణ జాగృతి ఆందోళన
పోలీసులు కవితను అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళనకు, దిగారు. “మాకు న్యాయం కావాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిన్నారి మృతికి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారుల నినాదాలతో డీజీపీ కార్యాలయ పరిసరాలు హోరెత్తాయి.
డీజీపీతో భేటీకి అనుమతి
పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు చివరకు వెనక్కి తగ్గారు. కవితతో పాటు మరో ఐదుగురు నాయకులను, మాత్రమే డీజీపీని కలిసేందుకు అనుమతించారు. దీంతో ఆమె లోపలికి వెళ్లి చిన్నారి మృతి కేసుపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: