📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Telugu News: Urea-రోడ్లపైనే వంటావార్సు – పాస్పుస్తకాలను తగలబెట్టిన రైతులు

Author Icon By Pooja
Updated: September 6, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Urea-హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరతపై నిరసనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. యూరియా ఇవ్వడం లేదనే ఆగ్రహంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులను రైతులు నిర్బంధిస్తున్నారు. మరోపక్క పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను తగుల పెట్టడం, రోడ్లపై వంటావార్పు, ధర్నాలు, ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర యూరియా(Urea) కొరతపై రైతులు వరుస నిరసనలు చేపట్టారు. యూరియా కోసం ఎదురు చూసినా తగినంత సరఫరా లేకపోవడంపై ఆందోళన చెందుతున్న రైతులు రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలో పట్టాదార్ పాస్బుక్లు, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. గంటల తరబడి వేచి చూసినా యూరియా టోకెన్లు జారీ చేయడంలో విఫలమైన సొసైటీ అధికారుల తీరు పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన కొందరు రైతులు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను తగలబెట్టారు.

సహకార సంఘాల వద్ద ఉద్రిక్తత

వ్యవసాయ సహకార పరపతి సంఘం సిబ్బందిని రైతులు కార్యాలయాల్లో బంధించారు. ఇదే జిల్లాలోని మరిపెడలో యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారం అందడంతో రైతులు పీఏసీఎస్ గేటు దూకి లోపలికి పరిగెత్తారు. యూరియా కోసం పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిలోని మాందారిపేట వద్ద రైతులు నిరసన తెలిపారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా యూరియా కొరత కారణంగా రైతులు సహకార సంఘం కార్యాలయాల వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, అయినా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా తగినంతగా సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.

కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని గానుగపాడు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. తగినంత పరిమాణంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని జూలూరుపాడులో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందిని కార్యాలయంలోనే బంధించారు.

యూరియా సరఫరా లోపాలు

ప్రతి రైతుకు కనీసం మూడు బస్తాల యూరియా అందించాల్సి ఉండగా, కేవలం ఒక బస్తా మాత్రమే ఇచ్చారని విమర్శించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కార్యాలయానికి వచ్చి షట్టర్ తెరిచారు. సహకార సంఘం అధికారులు 40 టన్నుల యూరియాకు ఆర్డర్ ఇచ్చామని, కానీ పది టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని తెలిపారు. స్టాక్స్ వచ్చిన వెంటనే మిగిలిన యూరియా ఇస్తామని చెప్పారు.

జాతీయ రహదారులపై నిరసనలు

వరంగల్ జిల్లా ఖానాపురం వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు వంటావార్పు నిర్వహించారు. నిరసన కారణంగా వాహనాలు అనేక కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్యూలైన్లో రైతులు స్పృహ కోల్పోయిన సంఘటనలు అనేక చోట్ల చోటుచేసుకున్నాయి. యూరియా తగినంతగా సరఫరా చేయాలని డిమాండ్(Demand) చేస్తూ ఇదే జిల్లాలోని నర్సంపేటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూపాలపల్లి, డోర్నకల్ మరియు మరిపెడ వంటి అనేక చోట్ల ఇలాంటి నిరసనలు జరిగాయి.

రైతులు ఏ కారణంతో పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను తగలబెట్టారు?
యూరియా సరఫరా లేకపోవడంపై ఆగ్రహంతో నిరసనగా తగలబెట్టారు.

యూరియా కొరత ఎక్కువగా ఏ జిల్లాల్లో కనిపిస్తోంది?
మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రంగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-hyderabad-railway-arrangements-for-festive-rush/business/542509/

Aadhaar burning Farmers Protest Google News in Telugu Latest News in Telugu Passbook burning Telangana Farmers Telugu News Today urea shortage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.