📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana-గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసిన హైకోర్టు

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana-పరీక్షలంటే ఎంతో కష్టపడి చదవాలి. ఇక పోటీపరీక్షలు అంటే ఎంతో ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. పాస్ అయితే తమ జీవితమే మారిపోతుందని కలలు కనే యువత ఎందరో. ఎందుకంటే వారు రాత్రీపగలు కష్టపడి చదివి ఉంటారు. కానీ వాటన్నింటిని కోర్టులు ఆ పరీక్షా ఫలితాలను రద్దు చేస్తే ఆ వేదన భరించడం కష్టమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? నేడు (మంగళవారం) తెలంగాణ ` హైకోర్టు టీజీపీ ఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది.

పరీక్షలను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

ఇటీవల టీజీపీ ఎస్సీ(TGP SC) నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మెయిన్స్ పరీఓలను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని 20 మంది అభ్యర్థులు ఈ పిటీషన్లలో కోరారు. మరోవైపు ఇప్పటికే టీజీపీఎసీ గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్పత్తుల దశలో ఉన్న గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయరాదంటూ మరికొందరు ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశారు. ఇక హైకోర్టులో దాఖలైన అన్ని పిటీషన్లపై వాదనలు ముగిశాయి.మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. జులై 7న ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులను పెండింగ్లో పెట్టింది. అయితే అనూహ్యంగా హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులను పెండింగ్ లో పెట్టింది. అయితే అనూహ్యంగా హైకోర్టు గ్రూప్ 1 ఫలితాలను(Results) రద్దు చేస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చింది.

ఆందోళనలో అభ్యర్థులు

అయితే హైకోర్టు తీర్పుతో గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ దశలో హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 నియామకాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ సమీక్ష చేపడుతుంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డిగ్రీలు చేతపట్టుకుని సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు హైకోర్టు నిర్ణయం తీరని ఆవేదన మిగిల్చింది. ఒకవేళ పరీక్ష రద్దు చేస్తే తమ భవిష్యత్తు మరింతగా ఇబ్బందికి గురవుతుందని, తమ వయోపరిమితి కూడా ముగిసిపోతుందనే ఆందోళన అనేకుల్లో ఉంది.

హైకోర్టు ఏ ఫలితాలను రద్దు చేసింది?
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది.

హైకోర్టు రద్దు చేసిన కారణం ఏమిటి?

ఎంపిక ప్రక్రియలో లోపాలు, పారదర్శకత లోపించడం కారణంగా హైకోర్టు ఫలితాలను రద్దు చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-tummala-nageswara-rao-strict-measures-in-urea-distribution/breaking-news/543840/

Breaking News in Telugu Group 1 Mains Cancelled High Court Telangana Latest News in Telugu Telangana Group 1 Results Telangana news TSPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.