📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Supreme Court-హోసింగ్ సొసైటీల ఇళ్ల స్థలాలపై రివ్యూ పిటీషన్ కొట్టేసిన సుప్రీమ్

Author Icon By Pooja
Updated: August 22, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Supreme Court: తెలంగాణలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి ప్రతికూల పరిణామం చోటుచేసుకుంది. ఇంతకుముందు ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ వెలువరించిన తమ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తీర్పు సమీక్షకు తగిన ఆధారాలు కనిపించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో(Justice Augustine George Masih) కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కరుణా దృష్టితో, సమానత్వంతో ఆలోచించి తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువకు సరిపడా ధర చెల్లించడానికి సిద్ధమని తెలిపారు. జర్నలిస్టులు తక్కువ జీతాలు, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా పనిచేస్తున్నందువల్ల వారిని ఇతర వర్గాలతో సమానంగా చూడటం సరికాదని వాదించారు. అయితే ఈ వాదనలకు కోర్టు ఒప్పుకోలేదు.

Telugu News: Supreme Court-హోసింగ్ సొసైటీల ఇళ్ల స్థలాలపై రివ్యూ పిటీషన్ కొట్టేసిన సుప్రీమ్

గతేడాది నవంబర్ 25న అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన జీవోను కొట్టివేసింది. ఆ తీర్పుతో 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా నిలిచిపోయింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రధాన ఆధారం అయింది. తాజాగా దాఖలైన రివ్యూ పిటిషన్లను(Review petitions) పరిశీలించిన ధర్మాసనం, తీర్పును మార్చడానికి ఎలాంటి న్యాయ కారణాలు లేవని తేల్చి చెప్పింది.

ఈ పరిణామంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. జర్నలిస్టులు నిరాశ చెందవద్దని, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో సంప్రదించి వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవకాశవాద రాజకీయాల వల్లే జర్నలిస్టులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. చాలీచాలని జీతాలతో కష్టాలు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆ బాధ్యతను బీజేపీ భుజాన వేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు వాదనలను ఎందుకు తిరస్కరించింది?
ధర్మాసనం పిటిషన్లలో కొత్త ఆధారాలు లేదా న్యాయ కారణాలు లేవని తేల్చి చెప్పింది. అందువల్ల రివ్యూ పిటిషన్లు కొట్టివేసింది.

ఈ వ్యవహారం ఎప్పుడు మొదలైంది?
2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ కేసు సుప్రీంకోర్టులోకి వచ్చింది. 2023 నవంబర్ 25న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేటాయింపులను రద్దు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/chiranjeevi-thanks-cm-revanth-reddy-film-workers-strike-end/cinema/534139/

Bandi sanjay Breaking News in Telugu BRS Congress Criticism Google News in Telugu House Site Allocation Journalists Issues Latest News in Telugu Supreme Court Judgement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.