📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: BC-బిసి గురుకుల పాఠశాలలోమంత్రుల ఆకస్మిక పర్యటన

Author Icon By Pooja
Updated: September 8, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BC: కామారెడ్డి జిల్లా బిక్నూర్ (Biknoor) మండలంలోని జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు.

ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆదేశాలు

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో చెత్త చెదారం లేకుండా పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. అలాగే సిలబస్ పూర్తి స్థితిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయాన్ని సాధించాలని మంత్రులు విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.

ప్రతిభావంతుల సత్కారం

ఈ సందర్భంగా ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన జి.సంధ్య రాణి, విద్యాదాన్ స్కాలర్‌షిప్(Vidyadan Scholarship)పొందిన ఎస్.శ్రావణి, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో ఎంపికైన ఎస్.మాధవి, అనితలను మంత్రులు సత్కరించారు. ప్రిన్సిపాల్ పాల్ జె. శ్రీలత, ఉపాధ్యాయులను కూడా శాలువాతో సన్మానించారు.

క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విద్యతో పాటు క్రీడలు, కళల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు తానే స్వయంగా డ్రాయింగ్ వేశారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మంత్రులు ఎక్కడ తనిఖీ చేశారు?
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో మంత్రులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీలో ప్రధానంగా ఏ అంశాలను పరిశీలించారు?
ఆహార నాణ్యత, పరిశుభ్రత, సిలబస్ పూర్తి స్థితి, విద్యార్థుల సమస్యలను పరిశీలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-breaking-news-child-falls-into-canal/andhra-pradesh/543084/

Akasmika Parayatanam BC Gurukul School Breaking News in Telugu Google News in Telugu Jangampalli Komareddy District ponnam prabhakar Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.