BRS: నిన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ రోజు ఆ పార్టీ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్(Suspend) చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన సంచలన ఆరోపణలతో ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో ఆపార్టీ నాయకులు ఆందోళన చేశారు. హరీశ్ రావు, కేసీఆర్లపై కవిత చేసిన వ్యాఖ్యలకు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయినట్లు వారు ఆరోపించారు. పార్టీ నాయకులను కించపరిచే
ప్రయత్నాలను సహించబోమని వారు కవితను హెచ్చరించారు. కవిత బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కవిత ఫ్లెక్సీలను చింపుతున్నారు. కాగా త్వరలోనే కవిత కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు సమాచారం.
కవితపై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ఏమిటి?
కవిత బీజేపీకి అమ్ముడుపోయారని, పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శించారు.
కవిత రాజకీయ భవిష్యత్తు గురించి ఏమైనా సమాచారం ఉందా?
కవిత త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం వెలువడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: