📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Latest news: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం

Author Icon By Saritha
Updated: November 29, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదాద్రి భక్తులకు(Telangana) శుభవార్తను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట(Yadagirigutta) మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ కోసం ఇప్పటికే అవసరమైన నిధులు ఆమోదం పొందాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.26 కోట్ల వ్యయంతో జరుగుతున్న మొదటి దశ పనులు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు పూర్తవుతాయని చెప్పారు. అనంతరం మరో రూ.10 కోట్లతో రెండవ దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Read also: తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు

MMTS train facility to Yadadri

ప్రయాణికుల సౌకర్యాల పెంపుకు కేంద్రం నిర్ణయాలు

తెలంగాణలో(Telangana) రైల్వే సేవలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోందని, సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి రూ.720 కోట్లు, నాంపల్లి స్టేషన్ కోసం రూ.350 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా హైటెక్ సిటీ స్టేషన్‌లో 16 ప్రత్యేక రైళ్లకు తాత్కాలిక హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, షిర్డీ, ముంబై, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగనున్నాయని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Hitec City Station hyderabad Kishan Reddy Latest News in Telugu MMTS Railway Railway Development Telangana Train Services yadadri Yadagirigutta

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.