📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Telangana: త్వరలోనే వైద్యశాఖలో 850 పోస్టుల భర్తీ ?

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని (Telangana) నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్(Damodar) రాజనర్సింహ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రిపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్‌లో అదనంగా 125 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఖాళీగా ఉన్న 850 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని శాసనసభలో హామీ ఇచ్చారు. శాసనసభ వేదికగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,790 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం ఆసుపత్రులతో పాటు వివిధ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా, రోగ నిర్ధారణలో కీలకమైన 9 కొత్త ఎంఆర్‌ఐ యంత్రాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ చర్యలతో ఖరీదైన వైద్య పరీక్షలు పేదలకు ఉచితంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Read Also: Hyderabad Crime: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి

వైద్య సేవల్లో మార్పులు

అత్యవసర సేవలపైనా ప్రభుత్వం (Telangana) దృష్టి సారించిందని, కొత్త అంబులెన్స్‌ల రాకతో రెస్పాన్స్ సమయం 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది మరో 79 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టి ఈ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. డయాలసిస్ రోగుల కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకపై బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేకుండా నేరుగా సెంట్రల్ స్టోర్స్ నుంచి సరఫరా చేసేలా కొత్త విధానం తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Damodar Rajanarasimha free medical services Government Hospitals Latest News in Telugu NIMS Hyderabad Telangana Government Jobs Telangana jobs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.