Telangana Weather Update: హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలంగాణ రాష్ట్రానికి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also : Moinabad Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలనం..అభిషేక్ సింగ్ అరెస్ట్

పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాల్లో గంటకు 41 నుండి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని హెచ్చరించింది.
ఏపీలోనూ కొనసాగుతున్న వానలు
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం చల్లబడింది. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏపీలోని మరికొన్ని సరిహద్దు జిల్లాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :