📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Weather: వాతావరణంలో అనూహ్య మార్పులు

Author Icon By Saritha
Updated: March 16, 2026 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Weather: వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులతో రాష్ట్రంలోని అన్నదాతలు బెంబేళెత్తిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరువులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో ప్రజలు కాసింత ఉపశమనం పొందుతున్నా రైతులు మాత్రం బెంటేశెత్తిపోతున్నారు.

Read Also: Rythu Bharosa Funds: 22న యాసంగి రైతు భరోసా పంపిణీ

Telangana Weather: Unexpected Changes in Weather Conditions

పంటలపై వర్షాల ప్రభావం

ప్రస్తుతం రైతులు సాగు చేసిన యాసంగి పంటలు చేతికొచ్చే సమయం కావడంతో ఈ సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వేరుశనగ, మిర్చి, పసుపు తదితర వంటలు కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యాసంగి వరి పంట కంకి ఈనేద దశలో ఉంది. ఈ తెలంగాణలో బెంబేలెత్తిపోతున్న రైతులు ప్రస్తుతం కంకి ఈనె దశలో వరి పంట నేల రాలనున్న మామిడి.. నేల వాలనున్న మొక్కజొన్న కల్లాల్లో ఉన్న వేరుశనగ, మిర్చి పంట దిగుబడులు 20 వరకు పలు జిల్లాలకు వర్ష సూచన దశలో ఆకాల వర్షాలు, వ డగళ్లు కురిస్తే తాలు పోయే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, టమాట, కూరగాయలతోపాటు మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లనుంది.

జిల్లాల వారీగా వర్ష సూచన

ఈ నెల 17వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలుకూడా పడే అవకాశం ఉందని రైతులు, ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వడగళ్ల వానలు

కేవలం వర్షమే కాకుండా, సెకనుకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీరే. బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు ప్రజలను బెంబేలెత్తించనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లో మార్చి 18 19 తేదీల్లో మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ ఇబ్బందులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నాడు. దాదాపు నెలన్న రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9గంటల దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి పరిస్థితి నెలకొంది.

మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సమాచారంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. అయితే ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీస్తాయని, ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Heavy rains in Hyderabad IMD Hyderabad alert Latest News in Telugu Telangana Weather Updates Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.