📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Telangana Villages: ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం భారీ నజరానా

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సౌరశక్తి వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ‘మోడల్ సోలార్ విలేజ్’ (‘Model Solar Village’) పేరిట ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ములుగు జిల్లా (Mulugu District) లోని ఎనిమిది గ్రామాలను ఎంపిక చేసింది.

Liquor Applications: మద్యం దుకాణాలకు పెరుగుతున్న దరఖాస్తులు

(Mulugu District)ఈ గ్రామాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో సౌర ప్యానెల్లు (Solar panels) ఏర్పాటు చేసిన గ్రామానికి కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.దేశవ్యాప్తంగా కరెంటు వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (Energy sources) పై కేంద్రం దృష్టి సారించింది.

ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. తెలంగాణలో రెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

Telangana Villages

మే నెలలో ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం

దీని కింద పైలట్ ప్రాజెక్ట్‌ (pilot project) గా ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతో పాటు పస్రా, చల్వాయి, మంగపేట, ఏటూరునాగారం, వెంటాపురం గ్రామాలను ఎంపిక చేశారు.గతేడాది మే నెలలో ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల (Solar panels) ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక కిలోవాట్ ప్యానెల్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు రాయితీ లభిస్తుంది.

ప్యానెల్ ఏర్పాటుకు ఇంటిపై కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆసక్తి ఉన్న వినియోగదారులు `pmsuryaghar.gov.in` పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

central government scheme latest news Model Solar Village Solar Energy Project telangana Villages Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.