📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana: యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలో అన్ని జిల్లాలలో అమలుకు సన్నాహాలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Telangana: వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన యూరియా యాప్ 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా గత రెండ్రోజుల నుండి పరిశీలించడం జరిగిందని, 5 జిల్లాలలో దాదాపు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామ జిల్లాలో 5,150, మహబూబ్నగర్ 3,741, నల్లగొండ 3,618, పెద్దపల్లి జిల్లాలోని 6289 మొత్తం 19,695 మంది రైతులు ఈ యాప్ ద్వారా యూరియాను తమ సమీప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకోవడం జరిగిందని తెలిపారు.

Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

అంతేకాకుండా 217 మంది కౌలు రైతులు కూడా 678 యూరియా బస్తాలు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని, మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించడం జరిగిందని తెలిపారు. రైతులు కూడా ఈ యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, వారికి వారి ఊరిలో ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో స్టాక్ తెలుస్తుందని, తద్వారా వారు బుక్ చేసుకొని, వారికి నచ్చిన సమయంలో షాప్ వద్దకు వెళ్లి ఒటిపి చూపించి కొనుగోలు చేసారని తెలిపారు. ఈ రెండు రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో, ఈ యాప్ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

రైతునేస్తం కార్యక్రమంలో యాప్(Urea app) పనితీరుపై రైతులు సంతృప్తి రెండు రోజుల్లో 60,510 బస్తాలు యాప్ ద్వారా కొనుగోలు చేసిన రైతులు కూడా రైతులకు యాప్ పై గల సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. ఈ రబీ సీజను గాను రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగిందని, యూరియా వినియోగం అధికంగా ఉండే జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను సరిపడ యూరియాను ముందస్తుగానే తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agriculture Minister Tummala Nageswara Rao hyderabad Telangana agriculture Urea Booking App Urea Ya App

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.