తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై ఈ లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు.
మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఆ ప్రకటన ఆధారంగానే కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Read also: Kalwakurthy: శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
Union Minister Kishan Reddy writes a letter to Revanth Reddy
మొదటి దశ స్వాధీనం తర్వాతే రెండో దశకు కేంద్రం చర్యలు
మెట్రో రెండో దశపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో చర్చించినట్లు కిషన్ రెడ్డి (kishan reddy) తెలిపారు. ముందుగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్రం స్వాధీనం చేసుకోవాలని సూచించారన్నారు. ఆర్థిక, పరిపాలనా నిర్ణయాలు పూర్తయ్యాకే రెండో దశపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు.
సంయుక్త కమిటీపై రాష్ట్రం స్పందించాల్సిన అవసరం
మెట్రో రెండో దశ సన్నాహాల కోసం కేంద్రం–రాష్ట్రం కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ఈ కమిటీలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు ఉండాలని తెలిపారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లు పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పేర్లు పంపితే మెట్రో రెండో దశ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: