📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మోయలేని పనిభారం.. ఉన్నతాధికారులపై ఆగ్రహం

Author Icon By Tejaswini Y
Updated: March 7, 2026 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారుల (ఎఇఒ) పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. ఉన్నతాధికారుల తీరుతో వివక్షకు గురవుతున్నామని ఎఇఒలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల వేధింపులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాటకు సిద్ధం అవుతున్నట్టుగా ఏఈఓ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏఈఓ లు ఉన్నతాధికారుల తీరుకు నిరసనగా జిల్లా వ్యవసాయ అధికారులకు నిరసన పత్రాలు అందజేశారు.

Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

రైతు గుర్తింపు కార్డుల నమోదు

రైతు భరోసా, రైతుబీమా, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్షలు, రైతు గుర్తింపు కార్డుల నమోదు, పంటల సర్వే మొదలగు 49 రకాల విధులు నిర్వర్తిస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్న తమకు క్షేత్రస్థాయిలో సహాయకులను కేటాయించకుండా ఉన్నతాధికారులు ఇబ్బందిపెడుతున్నారని ఎఇఒలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి క్షేత్ర స్థాయిలో వెంటనే గ్రామ వ్యవసాయ సహాయకులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

Telangana: Unbearable workload.. Anger at superiors

ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పంట సర్వేలో భాగంగా రాష్ట్రంలో జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాపులు ఉన్న 9,795 గ్రామాల్లో ఈ రబీ నుండి 100 పంట అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,795 మంది వాలంటీర్ లను నియమించిన విషయం తెలిసిందే. అయితే జియో రిఫరెన్స్ మ్యాపులు లేని సుమారు 20 లక్షల ఫామ్ ఫీల్డ్స్ తో పాటుగా, కౌలు, యన్.డీ.ఎస్, సమస్యాత్మక భూములు, పట్టా లేకుండా రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న లక్షలాది ఎకరాల అటవీ హక్కు పత్రం కలిగి ఉన్న భూములను
సైతం సర్వే చెయ్యాల్సి వస్తోంది.

ఈ బాధ్యతలను మళ్ళీ ఏఈఓ ల భుజాలపైనే వ్యవసాయశాఖ వేసింది. ఏఈఓలు పంట సర్వే, ఫార్మర్స్ రిజిస్ట్రీలో రైతుల నమోదు, యూరియా యాప్ లో రైతుల మొబైల్ నంబర్ అప్డేషన్ వంటి పనుల్లో బిజీగా ఉండగా వలంటీర్ లు వంట సర్వేలో భాగంగా తీసిన పంట పొలాల ఫోటో లను వెరిఫై చేసే బాధ్యతను కూడా వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారుల (ఎవో)కు అప్పజెప్పింది. మండల వ్యవసాయ అధికారులు తమ ఉద్యోగ సంఘాల అధికారం, ధన మరియు రాజకీయ బలంతో ప్రభుత్వం తమకు అప్పజెప్పిన పంటల ఫోటో వెరిఫికేషన్ బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో పైరవీ చేసి ఆ భారాన్ని కూడా ఏఈఓల పైకే బదిలీ చేయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు భగ్గుమంటున్నారు. వ్యవసాయశాఖలో 49 రకాల పనుల భారం మోస్తూ శాఖకు వెన్నెముకగా నిలుస్తున్న ఏఈఓలపై ఇకనైనా పనిభారం తగ్గించాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఎఇఒల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AEO Protest Agriculture Extension Officers Digital Crop Survey Farmer Registry Telangana Telangana agriculture

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.