Ugadi 2026: రేవంత్ సర్కార్ పంచాంగం.. కొన్ని చిక్కులు తప్పవు

Read Time:  1 min
Ugadi 2026: The Revanth Government's Almanac—Some Complications Are Inevitable.
Ugadi 2026: The Revanth Government's Almanac—Some Complications Are Inevitable.
FONT SIZE
GET APP

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరాభవ నామ సంవత్సరంలో నీతిగా ఉండేవారికి విజయం లభిస్తుందని, అయితే పాలకులు ఆచితూచి అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మధ్య సమన్వయం ఉంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read also: Telangana Rising Vision 2047: బడ్జెట్ సిద్ధం.. యంగ్ ఇండియా కిట్స్ సహా ఆరు కొత్త పథకాలు!

Ugadi 2026: The Revanth Government's Almanac—Some Complications Are Inevitable.

Ugadi 2026: The Revanth Government’s Almanac—Some Complications Are Inevitable.

ఆర్థిక శాఖను పర్యవేక్షించే మంత్రికి కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం

ఈ ఏడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పండితులు కీలక హెచ్చరికలు చేశారు. ఆర్థిక శాఖను పర్యవేక్షించే మంత్రికి కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని, కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే గడ్డు కాలం తప్పుతుందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో వ్యవసాయం రంగం కళకళలాడుతుందని, నదులు పుష్కలంగా ప్రవహించి రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, కానీ నీటి పంపకాల విషయంలో ఇతర రాష్ట్రాలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

రియల్ ఎస్టేట్ జోరు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది మళ్ళీ పుంజుకోనుందని పంచాంగంలో తేలింది. భూముల కొనుగోలు చేసేవారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచించారు. ఇక ప్రకృతి పరంగా చూస్తే ఈసారి ఎండల తీవ్రత ( Heat_wave ) ఊహించని స్థాయిలో ఉంటుందని, ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలకులు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.