📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TET Results 2025: తెలంగాణ టెట్ రిజల్ట్స్ విడుదల

Author Icon By Sharanya
Updated: July 22, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టెట్ (Teacher Eligibility Test) 2025 ఫలితాలను (TET Results 2025) రాష్ట్ర విద్యాశాఖ చివరికి విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 మధ్య నిర్వహించిన పరీక్షల ఫలితాలు మంగళవారం అధికారికంగా విడుదలయ్యాయి.

పరీక్షా వివరాలు: పేపర్ 1 & పేపర్ 2

ఈసారి టెట్ పరీక్షను మొత్తం 16 సెషన్లలో, ఏడు భాషలలో నిర్వహించారు. పరీక్షల కోసం 90,205 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టీజీ టెట్ 2025 ఫలితాల్లో(TET Results 2025) 33.98శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై (30,649 candidates qualified) అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరైతే.. 29,043 మంది పాస్ అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ లో 48,998 మంది పరీక్ష రాస్తే 17,574 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లోని సోషల్ స్టడీస్ లో 41,207 మంది ఎగ్జామ్ రాస్తే 13,075 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

TG TET 2025 ఫలితాలు చెక్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. అధికారిక వెబ్‌సైట్‌కి ( tgtet.aptonline.in/tgtet/ResultFront) వెళ్ళాలి.
  2. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి
  3. మీరు రాసిన పేపర్‌ను సెలెక్ట్ చేయండి
  4. మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
  5. ఆ తర్వాత “Submit” బటన్ క్లిక్ చేస్తే ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది
  6. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తుకు సేవ్ చేసుకోండి

టెట్‌లో ఒక్కసారి క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులు అవుతారు. టెట్ సర్టిఫికెట్‌కు ఎక్స్‌పైరీ ఉండదు. అందుకే ప్రతి టెట్‌లో కొత్తగా రాయాలనుకునే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ హామీ మేరకు రెండోసారి టెట్

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, టెట్‌ను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించనున్నారు. 2024 చివరలో నిర్వహించిన టెట్‌కు కొనసాగింపుగా, 2025 జూన్‌లో మరోసారి పరీక్ష జరిపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Krishna River: కృష్ణా, గోదావరి పొంగుతున్నా..అలుగుపారని చెరువులు

Breaking News DSC Eligibility latest news Teacher Eligibility Test Telangana TET Telugu News TET Paper 1 Results TET Paper 2 Results TET Results 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.