(Telangana) తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 116 స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ, పోలీసులు ఏర్పాట్లు చేయగా.. కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సదాశివపేటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ అభ్యర్థిని కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Blinkit vs Zepto: ‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?
(Telangana) నిజామాబాద్, బోధన్, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీజేపీ (BJP), కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య నినాదాలు, వాగ్వాదాలు, కొద్దిసేపు ఘర్షణలు నమోదు అయ్యాయి. పోలింగ్ సిబ్బంది, పోలీసులు పాల్గొని ఉద్రిక్తతను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల దొంగ ఓటు ప్రయత్నాలను కూడా ఆపేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: