Telangana ST Welfare Budget: తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరియు షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2026-27 వార్షిక బడ్జెట్‌లో గిరిజన సంక్షేమ శాఖకు రూ. 12,600 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో గిరిజన రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చేలా ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అనే వినూత్న పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
Read Also:TG Budget: తెలంగాణలో 5 సరికొత్త సంక్షేమ పథకాలు

Telangana ST Welfare Budget: గిరిజన సంక్షేమానికి ₹12,600 కోట్లు
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను పంపిణీ చేయనుంది. దీని ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో వివిధ రకాల తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, గిరిజన ప్రాంతాల్లో హరిత విప్లవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ పథకాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అక్కడ లభించిన ఫలితాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన తండాలు మరియు గూడాలకు విస్తరిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. గిరిజన రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, వాణిజ్య తోటల ద్వారా అధిక ఆదాయం పొందేలా ఈ ‘గిరి జల వికాసం’ దోహదపడుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: