Telangana Smart Ration Card: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ పాత కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 90 శాతం లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా ఈ ఫిజికల్ కార్డులను అందించారు. అయితే, కొందరి కార్డులలో పేర్లు లేదా ఇతర వివరాలు తప్పుగా పడటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్‌లోనే తప్పులను సరిచేసుకుని, డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
Read Also :Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై గుడ్‌న్యూస్.. అసంపూర్తి ఇళ్లకు రూ.2-3 లక్షలు
Telangana Smart Ration Card: T-Ration యాప్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డు సరిదిద్దడం & డౌన్‌లోడ్ చేసుకునే విధానం

- స్టెప్ 1: మీ మొబైల్‌లోని Google Play Store నుండి అధికారిక T-Ration యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- స్టెప్ 2: యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- స్టెప్ 3: హోమ్ స్క్రీన్‌లో కనిపించే ‘Scan Smart RC’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: మీ దగ్గర ఉన్న ఫిజికల్ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను (Bar-code) ఫోన్ కెమెరా స్కానర్‌తో స్కాన్ చేయండి.
- స్టెప్ 5: స్కాన్ చేయగానే స్క్రీన్‌పై ‘Digital verification of smart card’ వివరాలు కనిపిస్తాయి. అందులోని కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాలను సరిచూసుకుని, ఏవైనా తప్పులు ఉంటే సరిచేసి సబ్‌మిట్ చేయండి.
- స్టెప్ 6: వివరాలు కరెక్ట్ అయిన తర్వాత పైన ఉన్న డౌన్‌లోడ్ ఐకాన్‌పై క్లిక్ చేసి మీ స్మార్ట్ రేషన్ కార్డును PDF రూపంలో ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ కార్డును ఎక్కడైనా ప్రింట్/జిరాక్స్ తీయించి ప్రభుత్వ పథకాల కోసం, ఇతర అవసరాల కోసం నేరుగా ఉపయోగించుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :