📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: రాష్ట్రంలో డిప్యూటీ ఇఒల కొరత!

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : (Telangana) రాష్ట్రంలో పాఠశాల విద్యలో పర్యవేక్షణ చేసే అధికారుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులతోపాటు మండలి విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఉండాల్సిన అధికారులు కూడా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ సక్రమంగా జరగడం లేదు. రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు కొనసాగుతున్నారు. మిగిలిన 8 డీఈవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 62 డిప్యూటీ డీఈవో పోస్టులు మంజూరు కాగా.. వాటిలోనూ కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలుగా కొనసాగుతున్నారు. మిగిలిన 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 62 పోస్టుల్లో 30 శాతం డైరక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అలా భర్తీ చేయాల్సిన పోస్టులు 24 ఉన్నాయి. డైరక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ కోసం విద్యా శాఖ (Department of Education) అధికారులు ఖాళీలను భర్తీ చేసేలా రిక్రూట్మెంట్ చేయాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్ సి కి లేఖ రాశారు.

Read Also: Bandi Sanjay: ఉద్యోగులను బాధపెట్టొద్దు ఉసురు తగులుతుంది..

Telangana Shortage of Deputy EOs in the state!

డీఈవోల డైరక్ట్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

అయితే (Telangana) ఈ పోస్టుల భర్తీలో ఇంటరూర్తులను నిర్వహించాలని పేర్కొంటూ టిజిపిఎస్ సి విద్యాశాఖకు లేఖ రాసింది. దీనిపై వివరణ ఇస్తూ.. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీలోనే ఇంటర్వ్యూలను తొలగించిన నేపథ్యంలో డిప్యూటీ డీఈవోల భర్తీలో ఇంటర్వ్యూల ప్రస్తావన ఉండదని పేర్కొంటూ వివరణ పంపించినట్టు తెలిసింది. దీంతో ఇక డిప్యూటీ డీఈవో పోస్టుల్లో కేవలం నలుగురే రెగ్యులర్ డీఈవోలు కొనసాగుతున్నారు. డీఈవోలుగా పదోన్న తులు ఇవ్వాలంటే సర్వీస్ రూల్స్ లేకపోవడంతోపాటు, కొందరిపై ఛార్జ్ మెమోలు పెండింగ్లో ఉండటంతో పోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం డిప్యూటీ డీఈవోలుగా ఉన్న నలుగురు ఇన్చార్జ్ డీఈవోలుగా కొనసాగుతున్నారు. మరో ముగ్గురు ఐఏఎస్లు ఇన్ఛార్జ్ డీఈవోలుగా కొనసాగుతున్నారు.

సర్వీస్ రూల్స్ రూపొందిస్తే వాటి మేరకు పదోన్నతులు.

మిగిలిన వాటిల్లో జడ్పి సీఈవో, పరిశ్రమల శాఖ, ఇతర శాఖల అధికారులు ఇన్ఛార్జ్ డీఈవోలుగా
కొనసాగుతున్నారు. డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు పొందాలన్నా సర్వీస్ 62 పోస్టులకు రెగ్యులర్గా పనిచేస్తున్న వారు నలుగురే ఉన్నారు. 24 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం టిజిపిఎస్సీకి విద్యా శాఖ లేఖ రాశారు. ఇన్ఛార్జ్ డిఇఒలుగా ముగ్గురు ఐఎఎస్ రూల్స్ ఉండాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2018లో నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్తగా సర్వీస్ రూల్స్ను రూపొందించాల్సి ఉంది. సర్వీస్ రూల్స్ రూపొందిస్తే వాటి మేరకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యం అవుతుంది. సర్వీస్ రూల్ఫ్ రూపొందించనంత వరకు డిప్యూటీ డీఈవోలకి దీఈవోలుగా పదోన్నతులు రావు, అలాగే గ్రేడ్-2 జీహెచ్ఎంలకు గ్రేడ్-1 జీహెచ్ఎంలుగా పదోన్నతులు రావు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు పొందడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సర్వీస్ రూల్స్ ను రూపొందించి పదోన్నతులను ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

DEO Vacancies deputy deo education department Latest News in Telugu School Monitoring Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.