Telangana Schools: ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి

Read Time:  1 min
Telangana Schools: ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి
FONT SIZE
GET APP

Telangana Schools: తెలంగాణ విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం స్టేట్ బోర్డుకే కాకుండా CBSE, ICSE, IB వంటి అంతర్జాతీయ బోర్డులకూ వర్తిస్తుంది.

Read Also: Telangana: సోదరా లొంగిపో.. మావోయిస్టు అగ్రనేత గణపతికి రామచంద్రరావు వేడుకోలు

చట్టం-2018 కఠిన అమలు

ప్రస్తుతం అనేక కార్పొరేట్ పాఠశాలల్లో మార్కుల వేటలో పడి తెలుగును విస్మరిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కనీసం తెలుగు సరిగ్గా చదవలేకపోవడాన్ని భాషా సంక్షోభంగా గుర్తించిన సర్కారు, తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.కేవలం స్కోరింగ్ కోసమే అరబిక్, సంస్కృతం వంటి భాషలకు ప్రాధాన్యతనిస్తూ, తెలుగును అటకెక్కిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Telangana Schools: Telugu subject is mandatory in every school
Telangana Schools: Telugu subject is mandatory in every school

సరళమైన తెలుగు కోసం ‘వెన్నెల’ పాఠ్యపుస్తకాలు

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కనీసం తెలుగులో చిన్న వాక్యాన్ని కూడా సరిగ్గా చదవలేకపోవడం భాషా సంక్షోభానికి దారితీస్తోందని గుర్తించిన సర్కారు, తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018ని కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో కోవిడ్ కారణంగా 9, 10 తరగతులకు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తూ, 2025-26లో 9వ తరగతికి, 2026-27 నాటికి 10వ తరగతికి ఈ నిబంధనను వర్తింపజేయనుంది.విద్యార్థులపై పనిభారం పడకుండా ప్రభుత్వం ఒక వినూత్న మార్పును ప్రవేశపెట్టింది. ఇతర బోర్డుల విద్యార్థుల కోసం కఠినమైన ‘సింగిడి’ పుస్తకాలకు బదులుగా, అత్యంత సరళంగా ఉండే ‘వెన్నెల’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది.

కేవలం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి 8వ తరగతి ఆపై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి పాఠశాల తగినంత మంది తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని, ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) నిర్దేశించిన పుస్తకాలనే బోధించాలని స్పష్టం చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాషకు కొత్త ఊపిరి పోసినట్లయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.