Telangana School Fee: ఫీజుల భారాన్ని ఈ ఏడాది కూడా మోయాల్సిందేనా?

Read Time:  1 min
Telangana School Fee: ఫీజుల భారాన్ని ఈ ఏడాది కూడా మోయాల్సిందేనా?
FONT SIZE
GET APP

Telangana School Fee: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణ చట్టం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వచ్చే లా కనిపించడం లేదు. బిల్లుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటి వరకు సిద్దం కానట్టు తెలుస్తోంది. చట్టం చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు సిద్ధంగా ఉండి ఉంటే ఈ నెల 16 నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణ బిల్లును ప్రవేశ పెడతా మనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్పి ఉండేవి. కానీ ఇప్పటి వరకు ప్రభు త్వం నుంచి ఫీజునియంత్రణ చట్టం బిల్లుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం నిల్

అంటే 2026-27 విద్యా సంవత్సరంలో కూడా ఫీజు నియంత్రణ చట్టం వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఫీజుల నియంత్రణ చట్టం రాకపోతే ఈ ఏడాది కూడా రాష్ట్రం లోని సుమారు 11వేల ప్రైవేటు స్కూల్స్ చదువుతున్న సుమారు. 32 లక్షల మంది విద్యార్థులు తిరిగి లక్షల్లో ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల వసూలులో హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉన్న ట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత ప్రైవేటు స్కూల్స్ అడ్మిషన్లకు లక్షల్లో డొనేషన్లను వసూలు చేస్తుండటమే కాకుండా.. ఏడాది ఫీజు సైతం లక్షల్లో ఉంటుంది. ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే ఉద్యోగస్తులు తాము సంపాదిస్తున్న దాంటో సగం వారి పిల్లల ఫీజులకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణ కోసం 2017లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతి రావు చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. తిరుపతి రావు కమిటీ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. వాటిల్లో 10 శాతం లోపు ఫీజులను యాజమాన్యాలు పెంచుకోవడానికి ప్రతిపాదించగా.. 15 శాతం కంటే ఎక్కువ అయితే ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను 2020లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై అప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది.

Read Also: Telangana Govt : అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు కీలక పదవులు

Telangana School Fee: ఫీజుల భారాన్ని ఈ ఏడాది కూడా మోయాల్సిందేనా?
Telangana School Fee: Do we have to bear the burden of fees this year too?

ప్రైవేటు స్కూల్స్ ఫీజు నియంత్రణ చట్టంపై పూర్తికాని మార్గదర్శకాలు

కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికా రంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ ఫీజులు భారీగా ఉన్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఫీజుల నియంత్రణ అంశంపై 2024 జూలైలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ ఆన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025ను ప్రభుత్వానికి సమర్పించింది.

ఫీజు నియంత్రణ కోసం విద్యా శాఖ కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. రెండేళ్లకోసారి 8 శాతం ఫీజులను పెంచుకోవడానికి స్కూల్ యాజమాన్యాలకు అనుమతి ఉండాలని.. అంతకంటే ఎక్కువగా 9 శాతం అంతకంటే ఎక్కువగా ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉండాలని ప్రతిపాదించింది. ఫీజుల నిర్ధారణలోనూ పలు అంశాలను పరిగణన లోకి తీసుకోవాలని ప్రతిపాదనల్లో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని (ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేయాలని, శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియకి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభిం చారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ఎంఈవోలు, డీఈవోలు ద్వారా ఏ స్కూల్లో ఎంత ఫీజు ఉంది? ఏ ఏ క్లాసులకు ఎంతెంత ఫీజు తీసుకుంటున్నారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గత మూడేళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఒక బేసిక్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాతి రెండేళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు.

విద్యా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

విద్యా శాఖపై ముఖ్యమంనరతి రేవంత్ రెడ్డి కొద్దిరో జుల క్రితం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం లోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామ న్నారు. నిబంధనలకు మించి ఫీజులు వసూ లు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సులను ప్రజాభిప్రా యం కోసం వెబ్సైట్లో ఉంచాలని సూచిం చారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలం టే నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే 2026-27 విద్యా సంవత్సరంలో చట్టం రూపొందే అవ కాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో త్వరగా చట్టం తీసుకొచ్చి ఫీజుల భారాన్ని తగ్గించేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు కోరుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.