తెలంగాణ(Telangana)లో విద్యార్థులు లేని ‘జీరో’ ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ పాఠశాలలను ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా గణాంకాల్లోకి కూడా చేర్చరు. 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణలో ఇలాంటి పాఠశాలల సంఖ్య 2,245గా నమోదైంది.
Read Also: MP DK Aruna: విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం
పాఠశాలల మొత్తం సంఖ్య 2,000 పైగా ఉండగా, వాటిలో 1,441 పాఠశాల(Government Schools)ల్లో విద్యార్థులు లేరు మరియు ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు(Teachers) ఉన్నారు. ప్రస్తుతానికి 1,441 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన పాఠశాలల విషయమై త్వరలో నిర్ణయం తీసుకోవనున్నారు.
అధికారుల ప్రకారం, స్థానికులు తమ పిల్లలను బడికి పంపాలనుకుంటే పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారు, అవసరమైతే ఉపాధ్యాయులను నియమిస్తారు. అలాగే, గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు 200 పాఠశాలలను కొత్తగా ప్రారంభించామని అధికారులు గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: