Telangana Rythu Bharosa Status: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకం నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. సిద్దిపేట వేదికగా ఈ భారీ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది.
Read Also: CM Revanth : రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?
Telangana Rythu Bharosa Status: సిద్దిపేట వేదికగా రైతు భరోసా శ్రీకారం: మూడు విడతల్లో సాయం!
సుమారు 73 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి మొత్తం రూ. 9,000 కోట్లను కేటాయించింది.

నిధుల విడుదల షెడ్యూల్
సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి నేడు సాయంత్రం ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికగా.. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులుండగా.. వీరిలో తొలి విడతలో ఒక ఎకరం వరకు సాయం అందించనున్నారు.
ఈ మేరకు రూ.3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరతాయి. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో రేపు (సోమవారం) రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమవుతాయి. ఆ తర్వాత ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, చివరి విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: