Telangana : రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాలకు రైతు భరోసాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ అధికవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ విస్తీర్ణంలో ఎటువంటి పంటలు పండించడం లేదని గుర్తించింది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
Read Also: Telangana: 3 రోజులు లిక్కర్ షాపులు బంద్?
పంటలు సాగు చేయని భూమిగా గుర్తింపు
అగ్రికల్చర్ యూనివర్శిటీ రూపొందించిన పంట వివరాలను టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమి లో 8 నుండి 12 శాతం సాగులో తేడా (20 లక్షల ఎకరాలు) కనిపిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న వివిధ జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్యభూమి ఉంటే అందులో 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి. అయితే, ఈ శాటిలైట్ మ్యాపింగ్ తో పంట బీమా అమలులో రైతులకు నష్టప రిహారం సకాలంలో అందడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడనుంది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా పట్టా ఉన్న ప్రతి భూమికీ కాకుండా, వాస్తవంగా కేవలం వంటలు సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వారంలోగా భరోసా నిధుల విడుదల
ఇందుకు గాను శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా రైతు భరోసాకు సంబంధించిన ఆర్థిక సాయం పంపిణీ చేపట్టనుంది. ఈ యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు చివరిదశకు చేరుకుంది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కాగా వానాకాలం, యాసంగి పంటల సాగు(Yasangi Rythu Bharosa) సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ రైతు భరోసా పేరిట అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఆ నగదు కోసం రైతులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. అయితే, రైతుభరోసా డబ్బులు రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: