Telangana RTC Strike News: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

Read Time:  1 min
Telangana RTC Strike News: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
FONT SIZE
GET APP

Telangana RTC Strike news: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ ఆందోళన జ్వాలలు మొదలయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. సంస్థ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు అందజేసిన నేతలు, అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్లడం మినహా తమకు మరో మార్గం లేదని వారు హెచ్చరించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత సమ్మె తేదీని అధికారికంగా ప్రకటిస్తామని జేఏసీ స్పష్టం చేసింది.

Read Also: PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 2,000.. వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

కీలక డిమాండ్లు ఇవే..

ముఖ్యంగా 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్ మొత్తంలో ఎలాంటి కోత లేకుండా 350 కోట్ల రూపాయలను నేరుగా ఆర్టీసీకి విడుదల చేయాలని కోరుతున్నారు. సంస్థకు రావాల్సిన సుమారు 2,500 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని వారు కోరారు. ఆర్థిక అంశాలతో పాటు ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు.

Telangana RTC Strike News
Strike siren in Telangana RTC

Telangana RTC Strike News: 14 రోజుల గడువు

క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిస్థాయిలో కొలిక్కి తీసుకువస్తూనే, కార్మికుల హక్కులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు చొరవ చూపకపోతే 14 రోజుల గడువు ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రకటిస్తామని, బస్సులను డిపోలకే పరిమితం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులలో మళ్లీ సమ్మె భయం మొదలైంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.