డిపోలో ఛార్జీంగ్ కేంద్రానికి రూ.10 కోట్లు: మంత్రి పొన్నం
హైదరాబాద్ : ఆర్టీసీ సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకు తీసు కెళ్ళుతుంటే కొంత మంది బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నారని చలో బస్ భవన్ కి రాజకీయ రంగు పులుముతున్నారని ప్రజలు గమనించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ 110 కోట్లు కేటాయించి బస్సు స్టేషన్ల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. గతంలో నిరసనలు కన్నీళ్లు అరెస్టులు జరిగాయి మేము ఆర్టీసి(TSRTC)కార్మికులసమస్యలు పరిష్కారం చేస్తున్నామని ఆయన వివరించారు. ఒక్క సంతకం 8 మందిపై వేస్తామని హెచ్చరిస్తే మేం రెండు డిపోలు బస్ స్టేషన్ల నిర్మాణం, కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు. కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం ప్రజా పాలన ప్రభుత్వం లో మా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం ఇప్పటి వరకు 250 చేశారని గణాంకాలతో వివరించారు. ఆర్టీసీ(Telangana RTC)ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి తీసుకొస్తున్నామని అన్నారు.
Read also: రతన్ టాటా బాలీవుడ్ ప్రయోగం ‘ఏత్‌బార్’ ఫ్లాప్, కానీ
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం
ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ , ఉద్యోగుల సంక్షేమం మూడు ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పారు. ఛలో బస్ భవన్ అంటూ బిఆర్ఎస్ నేతలు హడావిడి చేయడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు గత 10 ఏళ్లలో బంద్ లు, నిరసనలపై ఉక్కుపాదం మోపిన వారే చలో బస్ భవన్ పిలుపునిచ్చే హక్కు లేదని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూ సారని ఆయన ఆరోపించారు రెండు సంవత్సరాలుగా అనేక సమీక్షలు చేసి కార్గోకి మంచి ఆదాయం వస్తుందని అన్నారు. ప్రయా ణికుల సౌకర్యానికి సంబంధించి నగరంలో కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ(Telangana RTC) ఛార్జింగ్ స్టేషన్లు, హై టెన్షన్ లైన్ తీసుకురావడానికి ఛార్జీల సవరణ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే 265 ఈవీ బస్సులు నడుపుతున్నామని మూడు నెలల్లో 275 ఇవి బస్సులు వస్తాయని చెప్పారు.
ఆర్టీసీ గ్రీన్ ఫీతో స్వల్ప ఛార్జీ సవరణ మాత్రమే:
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఛార్జీ పెంచలేదు ఆర్టీసీ గ్రీన్ ఫీ తో స్వల్పంగా మాత్రమే సవరణలు చేసింది ఎలక్ట్రిక్ బస్సులు నడపా లంటే డిపో లో ఛార్జింగ్ స్టేషన్లు, హైటెన్షన్ లైన్ తో పవర్ కనెక్షన్ ఉండాలని ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ కు 10 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభా ల్లోకి వస్తుందని అన్నారు. కార్మికులు సిబ్బం ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఒక్క ఉద్యోగి ఇబ్బంది పడకుండా ఆర్టీసీ మా కుటుం బం అని వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తు న్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ సవరణలు జరిగాయని అన్నారు. బలి తీసుకున్నవాడే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. పిఆర్సి, పిఎఫ్, సిసిఎస్ బకాయిలు చెల్లించామని బిఆర్ఎస్ పదేళ్ళలో ఒక ఉద్యోగం నింపలేదని, ఒక కొత్తబస్సు కొనలేదని విమర్శించారు. 55 రోజలు సమ్మె చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: