తెలంగాణ(Telangana) ప్రభుత్వం(RTC Buses) మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులను మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేందుకు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలు 152 బస్సులను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నాయి.
Read also: ప్రధాని ప్రవర్తనపై ఖర్గే ఆగ్రహం

మహిళా సమాఖ్యలకు 448 కొత్త బస్సులు
ఇప్పుడు 448 కొత్త బస్సులను కొనుగోలు చేసి, మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రక్రియ కొనసాగుతోంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సీఈఓ దివ్యా దేవరాజన్ ప్రకారం, ఆర్టీసీ(RTC Buses) ఎండీకి లేఖ రాస్తూ, అవసరమైన అనుమతులు మంజూరు అయ్యాక వెంటనే కొత్త బస్సులను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తామని తెలిపారు. కొత్త బస్సులు చేరికతో మహిళల ఆదాయం మరింత పెరుగుతుందని, ఒక్కో బస్సుకు నెలకు రూ. 69,400 ఆదాయం రావడం కలిగే అవకాశముందన్నారు.
మహిళల స్థిర ఆదాయాన్ని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం “ఇందిరా మహిళా శక్తి పథకం”ను అమలు చేస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో 9 మండలాల సమాఖ్యలు 9 బస్సులను కొనుగోలు చేసి, వాటిని వివిధ డిపోలకు అద్దెకు ఇచ్చి నెలవారీ ఆదాయం పొందుతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: