Accident Victims: రహ వీర్ స్కీమ్ తెలంగాణలోనూ అమలు?

Read Time:  1 min
Accident Victims: రహ వీర్ స్కీమ్ తెలంగాణలోనూ అమలు?
FONT SIZE
GET APP

తెలంగాణలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల (Accident Victims) సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లపై ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, మరెందరో తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా యువత, పని కోసం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం.

Read Also: Telangana: నాలుగు రోజులు వరుస సెలవులు అవకాశం

Telangana: Rs 25,000 reward for saving accident victims
Telangana: Rs 25,000 reward for saving accident victims

‘రహ వీర్‌’ పథకాన్ని రాష్ట్రంలోనూ సమర్థంగా అమలు

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను (Accident Victims) కాపాడి.. ఆసుపత్రికి చేర్పించిన వారికి నగదు బహుమతి ఇవ్వాలని తెలంగాణ రవాణాశాఖ యోచిస్తోంది. సహాయం చేసే వారికి రూ.25 వేల నగదు బహుమతి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహ వీర్‌’ పథకాన్ని రాష్ట్రంలోనూ సమర్థంగా అమలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా బాధితులను హాస్పిటల్ తరలించే పౌరులను గౌరవిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వారికి రవాణా శాఖ ద్వారా రూ.25 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందిస్తామని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.