telangana rising global summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

Read Time:  1 min
telangana rising global summit 2025
telangana rising global summit 2025
FONT SIZE
GET APP

telangana rising global summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ప్రభుత్వం తో విస్తృత స్థాయి పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకే మొత్తం ₹1.11 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది.

తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు

పర్యాటక రంగంలో ₹7,045 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ₹10,000 కోట్లు, ఫెర్టిస్ గ్రూప్ ₹2,000 కోట్లు, కంపెనీ ₹1,800 కోట్లు, JCK 2 నుంచి ₹9,000 కోట్లు, AGP నుంచి ₹6,750 కోట్లు, మరో సంస్థ నుంచి ₹1,000 కోట్లు పెట్టుబడులు రావడం ఖరారైంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 40,000కి పైగా ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.

telangana rising global summit 2025
telangana rising global summit 2025

Read Also:  DK Sivakumar: బెంగళూరుతో హైదరాబాద్ పోటీ

ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడం తెలంగాణ(Telangana)ను అభివృద్ధి దిశగా మరింత వేగంగా నడిపించనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, వేగవంతమైన అనుమతి వ్యవస్థ రాష్ట్రానికి అదనపు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయని వ్యాపార సంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.