📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Rice Production: వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Rice Production: కొన్నేళ్లుగా తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎంతో పురోగతిని సాధించిందని, దేశంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు మెరుగైన ఆదాయం అందేం దుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు. ఫుడ్ ప్రాసెసింగ్పై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ టిసిసిఐ, డైరెక్ట రేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్ట్ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమితి అభివృద్ధి అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎఫ్ టిసిసిఐ ఫెడరేషన్ హౌస్లోని కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో తెలంగాణ నుండి ఆహార వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు ఎఫ్ఎల ప్రభావంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిజిఎఫ్ టి, ఎపి ఇడిఎ ఉన్నతాధికారులు, ఎగుమతిదారులు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిటలు, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సదస్సును ప్రారంభించి ప్రసంగించారు.

Read Also: Anna University Result 2026: అన్నా యూనివర్సిటీ రిజల్ట్స్ అవుట్!

Telangana Rice Production: Telangana Tops Rice Production

అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, నాణ్యత ప్రమాణాలు

అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహార వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు-ఎఫ్ఎ ప్రభావంపై సదస్సు ఉత్పత్తులు పోటీపడేందుకు గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు బలోపేతం కావాలని మంత్రి తెలిపారు. ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక వసతులు, అగ్రి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యానవన రంగానికి ముఖ్యంగా పండ్లు కూర గాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు ఎగుమతుల్లో మంచి అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. సరఫరా శ్రేణులు, ప్యాక్స్లు, కోల్టెరేజ్, లాజిస్టిక్స్ నెట్వర్క్ మెరుగుపడితే అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఉత్పత్తుల స్థానం మరింత బలపడుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, టారిఫ్ విధా నాల నేపథ్యంలో భారతీయ రైతుల ప్రయోజనాలు రక్షించబడాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగుమతిదారులు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, లాజిస్టిక్స్ సేవాదారులు, కన్సల్టెంట్లు, ఎప్పిఓలు పాల్గొని తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల గ్లోబల్ మార్కెట్ విస్తరణపై సవివరంగా చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Food Processing Industry FTCCI Hyderabad minister tummala nageswara rao Telangana agriculture Telangana Rice Production

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.