📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి కి దక్కిన అరుదైన ఘనత

Author Icon By Tejaswini Y
Updated: January 19, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 2.5 సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నంబర్ వన్ కెనడీ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లోని స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ‘లీడర్ షిప్: 21 సెంచరీ’ అనే కోర్స్కు హాజరుకాబోతున్నారు. దీనితో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంతే అవుతారు.

Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

Telangana: Revanth Reddy receives rare honor from Harvard University

లీడర్ షిప్ ఫర్ 21 సెంచరీ కోర్స్ చేయనున్న ముఖ్యమంత్రి

ఈ కోర్స్ పేరు 21వ శతాబ్దం కోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)’. ఈ కోర్స్ కోసం ఆయన ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్ లోని కెనడీ స్కూల్ క్యాంపస్లో ఉండి తరగతులకు హాజరవుతారు. ఐదు ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్మెంట్లు, హోమ్వర్క్లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ చైర్మన్గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాలనుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం విశేషాలు

ప్రైవేట్ ఐవి లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం. మాసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్ ఉంది. 1607లో స్థాపించబడింది (418 సంవత్సరాల చరిత్ర). గత 100 సంవత్స రాల్లో 75 సార్లు ప్రపంచంలో నంబర్ 1 విశ్వవిద్యాలయంగా నిలిచింది. విశ్వవిద్యాలయంలో 14 కళాశాలలు ఉన్నాయి: బిజినెస్ (హెచ్బిఎస్), లా (హెచ్ఎల్ఎస్), మెడికల్, గవర్నమెంట్, థియాలజీ శాస్త్రాలకు విడివిడిగా కాలేజీలు ఉన్నాయి. కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ విశేషాలు 1936లో స్థాపించారు. 1966లో అధ్యక్షుడు కెన్నెడీ పేరు పెట్టారు. గ్రాడ్యుయేట్, మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కోర్స్లు అందిస్తుంది. 2002: 52 పైగా మహిళా విద్యార్థులు. 2011: 75వ వార్షికోత్సవం విశ్వవిద్యాలయం 375 సంవత్సరాలు. 2014: పూర్వ విద్యార్థులు, దాతల నుండి ట్రిలియన్ డాలర్లు సేకరించింది. 2026 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విద్యార్థులతో, హార్వర్డ్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులు చదివే కళాశాలలో ఒకటిగా కెన్నెడీ స్కూల్ నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Harvard Kennedy School Harvard University Leadership 21st Century Revanth Reddy telangana cm

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.