Raitu Bharosa scheme : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ పథకంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాగుకు అనుకూలంగా లేని భూములకు, గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ వెల్లడించారు. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూముల పేరుతో కూడా గతంలో నిధులు పొందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులకు ఇకపై అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రెండు సీజన్లకు మొదట రూ.8 వేలు, (Raitu Bharosa scheme) ఆ తర్వాత రూ.10 వేలు వరకు పెట్టుబడి సాయం అందించారు. అయితే, ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసా పథకంగా మార్చి, ఎకరాకు పెట్టుబడి సాయాన్ని రూ.6 వేలుగా నిర్ణయించింది. అయినప్పటికీ, అర్హత లేని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇకపై సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: