हिन्दी | Epaper
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Raitu Bharosa scheme : రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

Sai Kiran
Raitu Bharosa scheme : రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

Raitu Bharosa scheme : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ పథకంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాగుకు అనుకూలంగా లేని భూములకు, గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ వెల్లడించారు. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూముల పేరుతో కూడా గతంలో నిధులు పొందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులకు ఇకపై అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

Read also: Women T20 Series: రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వైజాగ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రెండు సీజన్లకు మొదట రూ.8 వేలు, (Raitu Bharosa scheme) ఆ తర్వాత రూ.10 వేలు వరకు పెట్టుబడి సాయం అందించారు. అయితే, ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసా పథకంగా మార్చి, ఎకరాకు పెట్టుబడి సాయాన్ని రూ.6 వేలుగా నిర్ణయించింది. అయినప్పటికీ, అర్హత లేని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇకపై సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870