Telangana Rain updates: రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అకాల వర్షాలు

Read Time:  1 min
Telangana Rain updates: రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అకాల వర్షాలు
FONT SIZE
GET APP

మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం

Telangana Rain updates: అకాల వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వరుసగా మూడో రోజు మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిశాయి. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి పట్టణం, ఇస్నాపూర్, పాశమైలారం, రుద్రారం, కంది, సదాశివపేటల్లో వడగళ్ళు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ నగర శివారులోని పటాన్‌చెరు. మాదినగూడ, బాచుపల్లి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో, సోమవారం మెదక్, సిద్ధిపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి.

Read Also: Ponnam Prabhakar: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తాం

Telangana Rain updates: రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అకాల వర్షాలు
Telangana Rain updates: Unseasonal rains lash the state

సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న పంటలు

తాజాగా సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్.. అక్కన్నపేట మండలాల్లో సోమవారం రాత్రి వీచినా ఈదురుగాలులకు ఆయా మండలాల్లోని పంటలక తీవ్ర నష్టం జరిగింది. పలు గ్రామాల్లో మామిడా కాయలు నేలరాలాయి. మొక్కజొన్న నేలవాలింది.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులతో రైతులు వణికి పోతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయోనని ఆందోళనతో ఉన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికందే దశలో వడగళ్లు, ఈదురుగాలులకు నేలపాలవ తుండడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో రైతులు కూరుకుపోతున్నారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి ఆడుకోవాలని ప్రభుత్వాని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.