📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Telangana: ఘనంగా ముగిసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల పిటిఎం

Author Icon By Tejaswini Y
Updated: January 24, 2026 • 2:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శుక్రవారం మెగా పేరెంటన టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండవ మెగా పిటిఎంను ఇంటర్ విద్య శాఖ విజయవంతంగా నిర్వహించింది. కొన్ని జిల్లాల్లో జరిగిన పిటిఎంకి జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. కలెక్టర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని సూచించారు. ఫిబ్రవరిలో జరిగే వార్షిక పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలన్నారు. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో అన్ని కోల్పోయినట్టు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు. పిటిఎం మీటింగ్లో ఆయా కాలేజీల్లో చదివి ప్రస్తుతం ఉన్నత హోదాల్లో ఉన్న వారు ఈ మీటింగ్కి హాజరై తమ అనుభవాలను విద్యార్థులకు చెప్పారు.

Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

Telangana: PTM of government junior colleges concludes successfully

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఎంబిబిఎస్ పాసైన వారు, టీచర్లు, పోలీస్ కానిస్టేబుల్స్, ఆర్మీ జవాన్లుగా మారిన వారు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 50,000 మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొని, తమ పిల్లల విద్యా ప్రగతి, హాజరు వివరాలు, ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్షల సన్నద్ధతపై సమీక్షి ంచారు. రెండు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ విద్యారంగంలోని ప్రధాన సంస్కరణలు, మౌలిక వసతులను ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ పిటిఎం(Parent Teacher Meeting) సందర్భంగా తల్లిదండ్రులకు వివరించారు. కాలేజీల మరమ్మత్తులు, వైట్ వాషింగ్, గ్రీన్ బోర్డుల ఏర్పాటు కోసం రూ.56.18 కోట్లు మంజూరు చేయగా, మరొక 41 కళాశాలల మరమతుల కోసం రూ.10.25 కోట్లు మంజూరు చేశారు.

కళాశాలలో రెండు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్

ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్ పిఎస్), రెండు ఇంటరాక్టివ్ డిజిటల్ ప్రొజెక్టర్లు (ఐడిపిఎస్), ఇంటర్నెట్, జూమ్ కనెక్టివిటి ఏర్పాటు చేశారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ సహకారంతో జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అంది స్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం టెలీమానస్ హెల్ప్న్ (14416), శిక్షణ పొందిన కౌన్సిలర్లు, ధ్యానం, జీవన నైపుణ్యాలు, భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందించే హెల్ప్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. కళాశాలల పేరు బోర్డులు ఏర్పాటు చేయ డంతో పాటు, వివిధ హోదాల్లో విజయవంతమైన పూర్వ, విద్యార్థుల ఫోటోలతో ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లి చండ్రులను సత్కరించడం ద్వారా ప్రస్తుత విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. మెగా పిటిఎంలో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యాభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వ విద్యార్థులు విలువైన సూచనలు చేశారు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాప కులు, తల్లిదండ్రులకు, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

government junior colleges Inter Exams Preparation Intermediate Education mega ptm Parent Teacher Meeting Telangana Education

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.