తెలంగాణలో విస్తరిస్తున్న నకిలీ ఆసుపత్రులు అర్హత లేని వైద్యులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వందల సంఖ్యలో అనధికారిక క్లినిక్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి నకిలీ కేంద్రాలను మూసివేయడమే లక్ష్యంగా కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఉన్న సంక్లిష్టమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చింది.
Read also: Kavitha-Ranganath: రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత
Telangana: Hospital Registration Goes Online — Putting a Check on Fraud
ఆన్‌లైన్ పోర్టల్‌తో పారదర్శక సేవలు
సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఆసుపత్రి నడపాలంటే కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, ఫైర్ క్లియరెన్స్, పనిచేసే డాక్టర్ల అర్హతలు వంటి అన్ని వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వైద్యాధికారి పరిశీలన అనంతరం కలెక్టర్ ఆమోదం తెలిపితేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. దీనివల్ల నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఆర్‌ఎంపీలు, నకిలీ వైద్యుల దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
ప్రజలకు అందుబాటులోకి ఆసుపత్రుల వివరాలు
త్వరలోనే ప్రతి ప్రైవేటు ఆసుపత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలు ఆన్‌లైన్‌లో చూసుకునేలా సౌకర్యం కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న పడకల సంఖ్య, అందిస్తున్న సేవలు, వాటి ధరల వివరాలను ప్రజలు ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల సామాన్యులు మోసపోకుండా సరైన వైద్యం పొందే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వైద్యరంగంలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: