Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల కష్టాలు మొదలయ్యాయి. గత ఏడు నెలలుగా రాష్ట్రంలో కొత్త పాస్ పుస్తకాల ముద్రణ నిలిచిపోవడంతో లక్షలాది మంది రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయి, మ్యుటేషన్ ప్రక్రియ కూడా ముగిసినా.. చేతికి పట్టా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!
బకాయిల దెబ్బ.. నిలిచిన ముద్రణ
గత ఏడాది జూలై నుంచే పాస్ పుస్తకాల ముద్రణలో జాప్యం మొదలవ్వగా, సెప్టెంబర్ నెల నుంచి ఇది పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి ప్రింటింగ్ ప్రెస్‌కు అందాల్సిన బకాయిలేనని తెలుస్తోంది. పాస్ పుస్తకాలను ముద్రిస్తున్న మద్రాస్ ప్రింటింగ్ (Madras Printing) ప్రెస్‌కు రెవెన్యూ శాఖ సుమారు రూ. 2.4 కోట్ల బకాయిలు పడింది. ఈ నిధుల విడుదలలో జాప్యం జరగడంతో సదరు సంస్థ ముద్రణను నిలిపివేసింది.
లక్షకు పైగా పెండింగ్‌లో పుస్తకాలు
అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1.06 లక్షల పాస్ పుస్తకాలు ముద్రణకు నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయి. మ్యుటేషన్ పూర్తయిన తర్వాత డిజిటల్ సంతకాలు కూడా అయిపోయినా, భౌతికంగా పాస్ పుస్తకం చేతికి రాకపోవడం వల్ల రైతులు బ్యాంక్ రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సంస్థతో సమస్యలు తలెత్తడంతో, ముద్రణ బాధ్యతలను వేరే సంస్థకు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (TSTS) గతంలోనే టెండర్లు పిలిచింది. అయితే, ఈ టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ ఖరారు కాలేదు. దీనివల్ల అసలు పాస్ పుస్తకాలను ఎవరు ముద్రిస్తారనే విషయంలో అధికారులకే స్పష్టత లేకుండా పోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: