తెలంగాణ (Telangana) లోని, కొండగట్టు ఆలయం ముందు అర్చకులు నిరసనకు దిగారు. ఆలయ ఈవో (Executive Officer) వ్యవహార తీరుకు వ్యతిరేకంగా అర్చకులు దేవాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా ఈవో తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలిపై అర్చకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆలయ సంప్రదాయాలు, అర్చకుల హక్కులను విస్మరిస్తూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Read Also: JobFair2026:హైదరాబాద్‌లో అపోలో ఫార్మసీ జాబ్ మేళా
పరిస్థితి ఉద్రిక్తం
సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుందని అర్చకులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈవో తీరు కారణంగా ఆలయ అర్చకులకు ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు తెలిపారు. ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా అర్చకుల నిరసన కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించి భద్రత కట్టు దిట్టం చేశారు. ఇదిలా ఉండగా ఆలయ ఈఓ గా శ్రీకాంతరావు బాధ్యతలు చేపట్టినప్పుటి నుండి ఆలయ ఆదాయం ఘననీయంగా పెరిగిందని సిఫారసులకు తావు లేకుండా సంస్కరణలు తీసుకువచ్చినట్లు భక్తులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: