📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: భారీగా తగ్గిన సన్న బియ్యం ధరలు..

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఇటీవల సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గడం గమనార్హం. సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న బియ్యం ధరల్లో ఈ తగ్గుదల వలన వినియోగదారులకు ఊరట కలిగింది. గతంలో క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పలికిన ధరలు ఇప్పుడు రూ.4,000 నుండి రూ.4,500 మధ్యకే పరిమితమయ్యాయి.ఈ ధరల తగ్గుదల వెనుక ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల ప్రభావం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్‌ (Bonus) ను ప్రకటించడం, రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా పెంచడం వంటి చర్యలు మార్కెట్‌లో డిమాండ్‌ను తక్కువ చేశాయి. దీంతో సరఫరా పెరిగి ధరలు స్వయంగా తగ్గుముఖం పట్టాయి.రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ సన్న వడ్లపై రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్న వడ్ల సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయింది. దీంతో ధాన్యం దిగుబడి భారీగా పెరిగి, సప్లై కూడా పెరిగింది. ఇది ధరలపై ప్రభావం చూపింది.

బియ్యం ధరలు

రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17,349 రేషన్ షాపుల ద్వారా గత నెలలో మూడు నెలలకు సంబంధించి 4.73 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ భారీ పంపిణీ కారణంగా బహిరంగ మార్కెట్‌ లో సన్న బియ్యం (Sanna biyyam) డిమాండ్ గణనీయంగా తగ్గింది.దానికి తోడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి సన్న బియ్యం ఆర్డర్లు తగ్గడం కూడా ధరల పతనానికి మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు.కాగా, జూన్ నుంచి క్రమంగా బియ్యం ధరలు తగ్గుతున్నాయి.జూలై మొదటి వారంలో మరింత పడిపోయాయి. గత ఏడాది క్వింటాల్ రూ.5,600 ఉన్న హెచ్ఎంటీ రకం బియ్యం ధర ఇప్పుడు రూ.4,600కు తగ్గింది. కర్నూల్ మసూరి రకం రూ.4,000కు చేరుకోగా, జై శ్రీరాం రకం రూ.5,800 నుంచి రూ.4,600కు పడిపోయింది.

Telangana: భారీగా తగ్గిన సన్న బియ్యం ధరలు..

టన్నుల బియ్యం

ఆర్ఎన్ఆర్, సాంబా రకాల ధరలు కూడా క్వింటాల్ రూ.1,000 వరకు తగ్గాయి.తగ్గిన ధరలు మధ్యతరగతి వినియోగదారులకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి.రేషన్ కార్డులు లేని సుమారు 30 లక్షల కుటుంబాలకు, నెలకు 60 వేల టన్నుల బియ్యం అవసరం ఉండగా వారికి ఈ ధరల తగ్గుదల లాభదాయకంగా మారింది. అయితే, బహిరంగ మార్కెట్‌లోని బియ్యం వ్యాపారులకు గిరాకీ 20 శాతానికి పైగా పడిపోయింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రైస్ షాపుల్లో రోజువారీ కొనుగోళ్లు భారీగా తగ్గాయని, కొన్ని ప్రాంతాల్లో బోనీ కూడా లేదని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో నెలకు 250 క్వింటాళ్ల బియ్యం అమ్మిన షాపులు ఇప్పుడు 100 క్వింటాళ్లు కూడా అమ్మలేని పరిస్థితి నెలకొందని రామంతపూర్‌కు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి ఆందోళన వ్యక్తం చేశారు.

సన్న బియ్యం తినడం వల్ల ఉపయోగాలు ఏమిటి?

సన్న బియ్యం అనేది తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే రకం బియ్యం. ఇది పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించడమే కాకుండా, వివిధ వంటకాలకు అనువుగా ఉంటుంది.

సన్న బియ్యం,పెద్ద బియ్యం మధ్య తేడా ఏంటి?

సన్న బియ్యం: మెత్తగా వండుతుంది, తేలికగా జీర్ణమవుతుంది. పెద్ద బియ్యం: కొంచెం గట్టిగా వుంటుంది, ఎక్కువ నీటి శాతం ఉంటుంది. వంటకు కొంత ఎక్కువ సమయం పడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Teenmar Mallanna: కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : తీన్మార్ మల్లన్న

Breaking News ration rice impact Sanna Biyyam latest rates Telangana Farmers Telangana government rice decision Telangana rice price drop Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.